-->

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
 గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం అనంతారం క్రాస్‌రోడ్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

స్థానిక గ్రామస్తులు రోడ్డుపై మృతదేహాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్‌ను గుర్తించే దిశగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793