కొండా సుష్మిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ కౌంటర్
కొండా సుష్మిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ కౌంటర్
హైదరాబాద్: కాంగ్రెస్ నేత కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ తీవ్రంగా స్పందించారు. సుష్మిత వ్యాఖ్యల కారణంగా ఇతర పార్టీలకు చెందిన వారు తమను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“మేము 10, 15 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తూ దొబ్బించుకుంటున్నాం. అయినా మాకు ఎమ్మెల్యే టికెట్ కూడా రాలేదు” అని ఇందిరా శోభన్ వ్యాఖ్యానించారు. పార్టీపై విమర్శలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు.
“రేవంత్ రెడ్డి అవినీతిపై నీ దగ్గర ఆధారాలు ఉంటే బయటపెట్టు. దమ్ముంటే ఆధారాలతో మాట్లాడాలి” అని సుష్మితకు సవాల్ విసిరారు. సుష్మిత చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆమె తల్లి కూడా తలదించుకునే పరిస్థితి వస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అలాగే, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కొండా సుష్మితతో మాట్లాడిస్తున్నాయనే విషయం తమకు అర్థమవుతోందని ఇందిరా శోభన్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు.

Post a Comment