తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. పలువురికి అదనపు బాధ్యతలు!

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. పలువురికి అదనపు బాధ్యతలు!


తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. పలువురికి అదనపు బాధ్యతలు!

` నవంబర్ 28`: తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా అవసరాల దృష్ట్యా పలువురు ఐఏఎస్, నాన్ క్యాడర్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (GAD) శనివారం జీఓ ఆర్టీ నంబర్ 1740ను విడుదల చేసింది. పలువురు అధికారులకు అదనపు బాధ్యతలు (FAC) అప్పగించింది.

బదిలీలు, నియామకాల వివరాలు ఇలా ఉన్నాయి..

1\. సర్ఫరాజ్ అహ్మద్ (IAS 2009): హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్న ఆయనను ప్రభుత్వ కార్యదర్శిగా (మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ – హెచ్‌ఎండీఏ పరిధి) నియమించారు. అలాగే జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు అప్పగించారు.

2\. ఈవీ నరసింహారెడ్డి (IAS 2017): మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఆయనను హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమించారు. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.

3\. బి. అజిత్ రెడ్డి (IDES 2012): ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా ఉన్న ఆయనకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు (FAC) అప్పగించారు.

4\. మయాంక్ మిట్టల్ (IAS 2020): హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఆయనను జీహెచ్‌ఎంసీ శంషాబాద్ జోనల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలతో నియమించారు.

5\. కె. చంద్రకళ: బదిలీపై హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా (కోర్ అర్బన్ రీజియన్, ల్యాండ్ పూలింగ్, మెట్రో రైల్) నియమితులయ్యారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ స్పెషల్ కలెక్టర్ (ల్యాండ్ అక్విజిషన్) బాధ్యతలు కూడా అదనంగా అప్పగించారు.

6\. ఐ.ఈ.ఎస్‌.ఎస్‌.డి. మనోజ్ (IAS 2023): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌గా ఉన్న ఆయనను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.

7\. పి. రాము: వరంగల్ స్టేట్ ఆడిట్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను విద్యాశాఖ స్పెషల్ ఆఫీసర్ (ప్రాజెక్ట్స్)గా నియమించారు.

8\. వి. శ్రీనివాస్ రెడ్డి: బదిలీ నేపథ్యంలో తన మాతృశాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గవర్నర్ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ చేశారు.


Blogger ఆధారితం.