-->

మెడికల్ కాలేజ్ లో దోబీ ఉద్యోగాలు రాజకులకే కేటాయించాలి కలెక్టరేట్ వద్ద ధర్నా

మెడికల్ కాలేజ్ లో దోబీ ఉద్యోగాలు రాజకులకే కేటాయించాలి కలెక్టరేట్ వద్ద ధర్నా

మెడికల్ కాలేజ్ లో దోబీ ఉద్యోగాలు రాజకులకే కేటాయించాలి కలెక్టరేట్ వద్ద ధర్నా

 "కలెక్టర్ హామీతో ధర్నా విరమించిన రజక నాయకులు"

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు ముదిగొండ రాంబాబు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

  ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముదిగొండ రాంబాబు చిటికన ముసలయ్య పాల్గొని మాట్లాడుతూ గత నెలలో పాల్వంచలోని మెడికల్ కాలేజీలో వివిధ విభాగాల ఉద్యోగాల కోసం ఓపెన్ క్యాటగిరిలో ఉద్యోగ ప్రకటనలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ధోబి పోస్ట్లు కూడా గౌరవ కలెక్టర్ గారు ఓపెన్ క్యాటగిరిలో ప్రకటించడం వలన సుమారు 129 మంది వివిధ కులాల వారు దరఖాస్తు చేసుకున్నారు.

 ఆ దరఖాస్తులో రజకులు 60 మందిలోపే దరఖాస్తు చేసుకున్నారు. ఉన్నవి 20 పోస్టులు.129 మంది రజకుల కులస్తుల ఉపాధికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది దీనివలన దరఖాస్తు చేసుకున్నాం మా రజకులకి చాలామందికి న్యాయం జరిగే పరిస్థితి.  జీవో నెంబర్ 27 1996 మే 21వ తారీకు జీవో వచ్చిందని దాన్ని అమలు పరచాలని డిమాండ్ చేశారు కావున మా రజక లబ్ధిదారులతో నింపాలని డిమాండ్ చేశారు.

ఇందుకు కలెక్టర్ స్పందించి మీ పోస్టులను రజక వృత్తిదారులతోనే సెలెక్ట్ చేస్తామనని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించడం జరిగింది.  

ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు నంద్యాల వెంకటేశ్వర్లు, ఉప్పునూరు నాగయ్య, సాలికోళ్ల శివ కుమారి, కంచర్ల శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, రాంబాబు,, పోతురాజు, భద్రయ్య, బిక్షం, యాదగిరి, రామ తులసి, రమేష్, ప్రవళిక, నాగమణి, స్రవంతి, రజిత తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793