అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించిన మాజీ కౌన్సిలర్ సాహెరా బేగం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 25వ వార్డులో మాజీ కౌన్సిలర్ సాహెరా బేగం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళా దినోత్సవం యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి వివరించారు.
1910లో రష్యాలోని శ్రామిక వాడాలో రోజా అనే మహిళ పురస్కరించుకొని మహిళలకు ప్రత్యేకంగా ఒక దినోత్సవాన్ని జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అదే 1910 మార్చి 8న మహిళా శ్రామిక దినోత్సవంగా జరుపుకున్నారు. అనంతరం ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మారిందని ఆమె వివరించారు.
మహిళల ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ, "మహిళలేనిదే పుట్టుక లేదు, సమాజం లేదు, సృష్టి లేదు. మహిళలు ఎంతో ఓపికగా కుటుంబాన్ని, సమాజాన్ని నడిపిస్తున్నారు" అని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు చీరాల సత్కారం చేసి, కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు అందుకున్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు పద్మ, కుమారి, శైలజ, ఆశ వర్కర్లు గంగా, శుశీల, RP రాజకుమారి, OBలు అనూష, సరోజ, K. కృష్ణవేణి, B. విజయలక్ష్మి, రమా, అంగన్‌వాడీ ఆయాలు చంద్రకళ, వరాలు, తుల్సి, సైండ్ల స్వాతి, టంగుతూరి శాంత తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం మహిళల సమైక్యత, వారి మహత్తును గుర్తుచేసే విధంగా ఎంతో ఉత్సాహంగా జరిగింది.

Post a Comment