-->

దిశా ప్రొటెక్షన్ వెల్‌ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

 

దిశా ప్రొటెక్షన్ వెల్‌ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో కొత్తగూడెం EX మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి

కొత్తగూడెం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దిశా ప్రొటెక్షన్ వెల్‌ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కొత్తగూడెం EX మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతా లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి మహిళ ఆర్థికంగా స్వావలంబిగా మారి సమాజంలో గౌరవంగా జీవించాలి అని ఆకాంక్షించారు. మహిళలందరి ముఖాల్లో చిరునవ్వులు వికసించేలా, వారు మరింత అభివృద్ధి సాధించేలా అందరూ కృషి చేయాలన్నారు. మహిళ సాధికారత కోసం తాను ఎప్పుడూ పాటుపడతానని, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

శానిటేషన్ వర్కర్ల ప్రేమాభిమానాలు

పదవిలో లేకపోయినా మున్సిపల్ శానిటేషన్ వర్కర్లు తమ అభిమాన నాయకురాలు కాపు సీతా లక్ష్మికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆమె నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ఆమెను శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా సీతా లక్ష్మి మాట్లాడుతూ, "నాకు పదవి ఉండకపోయినా మీ సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. శానిటేషన్ వర్కర్ల సంక్షేమం కోసం కృషి చేయడం నా బాధ్యత" అని భరోసా ఇచ్చారు.

కాపు సీతా లక్ష్మిని దైనమిక్ లీడర్ గా అభివర్ణించిన వర్కర్లు, ఆమె నాయకత్వ లక్షణాలను కొనియాడారు. మహిళా సాధికారత కోసం ఆమె చేస్తున్న కృషిని ప్రశంసించారు.

మహిళా సాధికారత కోసం సమిష్టి కృషి అవసరం

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే సమాజం వారిని ప్రోత్సహించాలి. ఆర్థిక స్వాతంత్ర్యం, సామాజిక గౌరవం సాధించేందుకు ప్రతి మహిళకు అవకాశాలు కల్పించాలనేదే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశ్యమని సీతా లక్ష్మి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సామాజిక సేవకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు, శానిటేషన్ వర్కర్లు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793