లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన శామీర్ పేట పోలీస్ స్టేషన్ ఎస్.ఐ.
శామీర్ పేట: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని శామీర్ పేట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్.ఐ. ఆఫ్ పోలీస్ ఎం. పరుశురామ్ అవినీతి ఆరోపణలపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) చేతుల్లో పట్టుబడ్డారు.
వివరాలలోకి వెళితే, ఒక ఫిర్యాదుదారుడు మరియు అతని సహాయకుడి పేర్లను, శామీర్ పేట పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసులో నిందితులుగా చేర్చకుండా చూడటానికి, అలాగే ఫిర్యాదుదారుని మొబైల్ ఫోన్‌ను తిరిగి ఇచ్చేందుకు అధికారికంగా సహకరించేందుకు పరుశురామ్ ఫిర్యాదుదారుని నుంచి రూ. 22,000/- లంచం తీసుకున్నారు. ఈ చర్యలో ఆయనను అనిశా అధికారులు అడ్డంగా పట్టుకున్నారు.
మరియు ఇదే సందర్భంగా, పరుశురామ్ గతంలోనూ ఫిర్యాదుదారుని నుండి మరో రూ. 2,00,000/- తీసుకున్నట్లు కూడా విచారణలో బయటపడింది. దీంతో అనిశా అధికారులు ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
Post a Comment