పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణ
పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు
దేశ రాజధాని ఢిల్లీ లో ఏర్పాటు చేసిన విలక్షణ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ భారతదేశ మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ ను స్వీకరించారు. దేశ ప్రగతికి, సినీ రంగానికి మరియు ప్రజా సేవకు అందించిన అమూల్యమైన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఈ గౌరవాన్ని అందజేసింది.
బాలయ్యగారి మంచితనం, ముక్కుసూటి మనస్తత్వం ఆయన్ని ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకునేలా చేసింది. ఇప్పుడు పద్మభూషణ్ అవార్డు ఆయనపై మరింత కొత్త బాధ్యతను మోపింది. ప్రజల కోసం మరింత సేవ చేయాల్సిన ఆత్మబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఈ పురస్కారం కలిగించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నందమూరి బాలకృష్ణకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు. బాలయ్య మరింత శక్తితో, మరింత ప్రభావంతో ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం.
Post a Comment