-->

భారతదేశంపై దాడి చేస్తే ఊరుకోము: పాక్‌కు JNTUH విద్యార్థి నేత ఎరవెల్లి జగన్ తీవ్ర హెచ్చరిక

భారతదేశంపై దాడి చేస్తే ఊరుకోము: పాక్‌కు JNTUH విద్యార్థి నేత ఎరవెల్లి జగన్ తీవ్ర హెచ్చరిక


కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ పరిధిలో క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఓ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో JNTUH (జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్) విద్యార్థి నేత ఎరవెల్లి జగన్‌తో పాటు విశ్వవిద్యాలయానికి చెందిన అనేక మంది విద్యార్థులు, స్థానిక క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

శాంతి ర్యాలీ సందర్భంగా ఎరవెల్లి జగన్ మాట్లాడుతూ,"భారతదేశంపై దాడులు చేస్తున్న పాక్ చర్యలను మేము సహించము. పాక్‌పై గట్టి పోరాటానికి సిద్ధం. మా దేశ భద్రత కోసం నిమిషం కూడా వెనుకాడము," అని హెచ్చరించారు.

ఇక పహాల్గామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పిస్తూ, వారిని "అమరవీరులు" గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన ప్రవీణ్ పగడాల గారి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని వారు కోరారు.

ఈ ర్యాలీ సందర్భంగా విద్యార్థులు మరియు సంఘ సభ్యులు ఉగ్రవాదాన్ని ఖండిస్తూ నినాదాలు చేశారు. "ఉగ్రవాదానికి బ్రేక్ వేయాలి", "భారత దేశ భద్రతకు మద్దతు ఇవ్వండి" వంటి నినాదాలు మోగించారు. భారీ సంఖ్యలో చర్చ్ యువత, సంఘ పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ర్యాలీ మార్గం: శాంతి ర్యాలీ శేరిలింగంపల్లి నుండి మియాపూర్ మీదుగా కూకట్పల్లి మెట్రో గ్రౌండ్ వరకు సాగి, అక్కడ ముగింపు సభ నిర్వహించబడింది. ముగింపు సభలో ప్రత్యేక ప్రార్థనలు: అనంతరం భారతదేశం, తెలంగాణ రాష్ట్ర భద్రత, శాంతి, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నాయకులు, అధికారులు సురక్షితంగా ఉండాలని భగవంతుని వేడుకున్నారు.

ప్రధాన అతిథులు: ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ క్రిస్టియన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ పి.ఎల్. ప్రసాద్, రాందేవ్ రావు హాస్పిటల్ సీఈఓ డాక్టర్ యోబు, వైసీపీ మైనార్టీ విభాగం అధ్యక్షులు పాస్టర్ జార్జ్, శేరిలింగంపల్లి నియోజకవర్గం యేసుపాదం, బీజేపీ దళిత మోర్చా నుండి దేవ సహాయం చిన్న, అడ్వొకేట్ చిందం శ్రీకాంత్, కుత్బుల్లాపూర్ పాస్టర్ అసోసియేషన్ నుండి రెవ. చిట్టిబాబు జాన్ క్రీస్తు దాస్, అలాగే సన్నీ, నవీన్, రూబెన్, సాగర్, మాణిక్యం, జాన్ తదితరులు పాల్గొన్నారు.

విశ్వవిద్యాలయ విద్యార్థుల నుండి: ప్రవీణ్, హనోక్, ప్రిన్స్, ప్రభు కుమార్, ఎస్తేర్, అశ్విని, మేరీ, ఆనంద్, బ్యూలా తదితర విద్యార్థులు చురుకైన పాత్ర పోషించారు.

Blogger ఆధారితం.