-->

పదవ తరగతి ఫలితాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలికలదే పైచేయి

పదవ తరగతి ఫలితాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలికలదే పైచేయి

జిల్లా విద్యాశాఖాధికారి M. వెంకటేశ్వరాచారి ప్రకటన

ఈ రోజు విడుదలైన పదవ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షా ఫలితాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విశేషమైన ఫలితాలు సాధించిందని జిల్లా విద్యాశాఖాధికారి M. వెంకటేశ్వరాచారి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సంవత్సరం జిల్లాలో మొత్తం 12,250 విద్యార్థులు పరీక్షలు రాయగా, వారిలో 11,208 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో జిల్లా మొత్తం ఉత్తీర్ణత శాతం 91.49% గా నమోదైంది.

వర్గాలవారీగా ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి:

  • బాలురు: 5,971 మంది పరీక్ష రాయగా, 5,320 మంది ఉత్తీర్ణులై 89.10% ఉత్తీర్ణత సాధించారు.
  • బాలికలు: 6,279 మంది పరీక్ష రాయగా, 5,888 మంది ఉత్తీర్ణులై 93.77% ఉత్తీర్ణత సాధించారు.

ఈ క్రమంలో బాలికలు బాలుర కంటే 4.67% ఎక్కువ ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. జిల్లాలో ఈసారి సాధించిన ఉత్తీర్ణత శాతం గత ఏడాదితో పోల్చితే 1.10% పెరిగింది.

మరింత సమాచారం:

  • ఈ పరీక్షలకు మొత్తం 299 పాఠశాలల నుండి విద్యార్థులు హాజరయ్యారు.
  • వాటిలో 78 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి, అందులో ప్రైవేట్ పాఠశాలలు 24, ప్రభుత్వ పాఠశాలలు 54 ఉన్నాయి.
  • జిల్లాలో 0% ఉత్తీర్ణత గల పాఠశాలలు లేవు, ఇది విద్యా రంగానికి సానుకూల సూచనగా చెప్తున్నారు.

రివెరిఫికేషన్/రికౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు మే 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు విధానం కోసం వారు చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలి.

ఫెయిల్ అయిన విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 16వ తేదీ వరకు రీ ఎగ్జామ్ ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ పరీక్షల సహాయక కమిషనర్ శ్రీ యస్. మాధవరావును (మొబైల్: 9989027943) సంప్రదించవచ్చును.

Blogger ఆధారితం.