స్పెషల్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లును సన్మానించిన సీనియర్ న్యాయవాదులు
కొత్తగూడెం, లీగల్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో న్యాయవ్యవస్థలో ఓ గౌరవనీయ సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల స్పెషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు స్వీకరించిన మెండు రాజమల్లును, మంగళవారం నాడు సీనియర్ న్యాయవాదులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా న్యాయవాద వృత్తిలో సేవలందిస్తున్న ప్రముఖులు, కొత్తగా బాధ్యతలు చేపట్టిన మేజిస్ట్రేట్‌కు తమ అభినందనలు తెలియజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ స్టాండింగ్ కౌన్సిల్స్ జి.వి.కే. మనోహర్ రావు, వెల్లంకి వెంకటేశ్వరరావు, ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీల స్టాండింగ్ కౌన్సిల్ రావి విజయకుమార్, ఛీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఊటికూరు పురుషోత్తమరావు పాల్గొని మేజిస్ట్రేట్ రాజమల్లుకు శాలువాతో సన్మానం చేసి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు న్యాయవ్యవస్థలో మెండు రాజమల్లు సమర్థవంతమైన సేవలందిస్తారని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇతర న్యాయవాదులు, న్యాయ సేవా సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు
Post a Comment