-->

గ్యాస్ సిలిండర్ పేలుడు కలకలం: బికనీర్‌లో 8 మంది మృతి

గ్యాస్ సిలిండర్ పేలుడు కలకలం: బికనీర్‌లో 8 మంది మృతి


బికనీర్ (రాజస్థాన్), : బికనీర్ జిల్లా మదాన్ మార్కెట్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదం ప్రజలను కలచివేసింది. ఒక బంగారం దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం, బంగారం మరియు వెండిని కరిగించేందుకు గ్యాస్ స్టవ్‌ను ఉపయోగిస్తున్న సమయంలో సిలిండర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి దుకాణం ఉన్న భవనం పూర్తిగా ధ్వంసమైంది.

ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించాయి. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసు శాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

స్థానికులు మరియు ప్రత్యక్ష సాక్షుల వాదన ప్రకారం, పేలుడు సమయంలో భారీ శబ్దం వినిపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదం మదన్ మార్కెట్ వ్యాపార వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది.

Blogger ఆధారితం.