దేశంలోని ప్రముఖ ఆలయాల్లో భద్రత కట్టుదిట్టం
భారత్–పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో, దేశంలోని ప్రముఖ ఆలయాల్లో భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది.
ఇటీవలి కాలంలో పాకిస్థాన్ తరచూ కాల్పులకు పాల్పడుతోంది. డ్రోన్ల ద్వారా సాధారణ ప్రజలపై దాడులు జరిపి పలు ఇళ్లను ధ్వంసం చేస్తోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు మరింత బలపరిచింది.
అందులో భాగంగా, ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రాలైన ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. అదనపు భద్రతా సిబ్బంది మోహరించడంతో పాటు, ప్రతి సందేహాస్పద చలనం పర్యవేక్షించేందుకు ఆధునిక పరికరాలను వినియోగిస్తోంది. అలాగే, అన్ని విమానాశ్రయాలకు హైఅలర్ట్ ప్రకటించడంతో పాటు, ప్రయాణికులు కనీసం మూడు గంటల ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించింది. ఈ మేరకు అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు.
Post a Comment