💥బ్రేకింగ్ న్యూస్... జనగామ జిల్లాలో దారుణ హత్య
జనగామ జిల్లా, లింగాలఘనపూర్ మండలం, పిట్టలోని గూడెంలో మానవత్వాన్ని మరిచిపోయే ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్తను అతని ఇద్దరు భార్యలు కలిసి దారుణంగా హత్య చేశారు.
మృతుడు: కలియ కనకయ్య (వయసు 40)
హత్యకు పాల్పడ్డవారు: అతని భార్యలు చుక్కమ్మ, గౌరమ్మ
తాజా సమాచారం మేరకు, భర్త కనకయ్యను ఇద్దరు భార్యలు కలిసి గొడ్డలితో నరికి హత్య చేశారు. గతంలో కనకయ్య తన అత్తను హత్య చేసిన నేపథ్యంలో, పగతోనే ఈ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.
ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉 మరింత సమాచారం కోసం మా అప్డేట్స్‌ను ఫాలో అవండి.
Post a Comment