నకిలీ పత్రాలతో 2 ఏళ్లు ఎస్సైగా చలామణి అయిన మహిళ అరెస్ట్..!
రాజస్థాన్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను షేక్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సికర్ జిల్లా పోలీసులు ఓ నకిలీ మహిళ ఎస్సైని అరెస్ట్ చేశారు. ఈమె అసలైతే ఎస్సైకు ఎంపిక కాలేదు. కానీ నకిలీ ధృవపత్రాలతో ఏకంగా రెండేళ్లపాటు పోలీస్ అకాడమీ లో శిక్షణ పొందింది. అధికారులతో ఫొటోలు దిగింది.. రీల్స్ చేసింది.. టెన్నిస్ ఆడింది కూడా!
మోసగాళ్లలో "మోనా" చలాకి..
నాగౌర్ జిల్లా నింబా కే బాస్ గ్రామానికి చెందిన మోనా బుగాలియా అలియాస్ మూలీ దేవి, 2021లో ఎస్‌ఐ నియామక పరీక్షలో విఫలమైంది. అయినా "మూలీ దేవి" అనే నకిలీ పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించి, సబ్ ఇన్‌స్పెక్టర్ గా ఎంపికైనట్లు చూపించింది.
- స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థిగా పోలీస్ అకాడమీకి ప్రవేశించింది
- రాజస్థాన్ పోలీస్ అకాడమీ లో రెండేళ్లపాటు ట్రైనింగ్ పొందింది
- ఐపీఎస్ అధికారులతో ఫొటోలు, ADGతో టెన్నిస్, యూనిఫాంలో రీల్స్
- అకాడమీ నిషేధిత ప్రాంతాల్లో కూడా తిరిగింది
- అసలు ఎస్సై కాకపోయినా యధేచ్చగా శిక్షణ తీసుకుంది
అనుమానంతో గుట్టురట్టు..
2023లో ఇతర ట్రైనీ ఎస్‌ఐలు ఆమె ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేశారు. పై అధికారులకు సమాచారం ఇవ్వగా, అంతర్గత విచారణ జరిగింది. దాంతో అసలు విషయం బైటపడింది. ఆమె ఎస్సైగా ఎంపిక కాలేదన్న స్పష్టతతో కేసు నమోదైంది.
అరెస్ట్, సీజ్ చేసినవి:
- సికర్ జిల్లాలో మోనా అరెస్ట్
- అద్దె ఇంటిలో రూ. 7 లక్షల నగదు,
- 3 పోలీస్ యూనిఫామ్స్,
- నకిలీ ఐడీలు,
- పరీక్షా పత్రాలు స్వాధీనం
Post a Comment