-->

హైదరాబాద్‌లో దొంగల బీభత్సం.. తాళాలు పగులగొట్టి విధ్వంసం!

హైదరాబాద్‌లో దొంగల బీభత్సం.. తాళాలు పగులగొట్టి విధ్వంసం!


హైదరాబాద్‌: నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని ఇనాంగూడలో దొంగలు రెచ్చిపోయారు. శనివారం అర్ధరాత్రి వరుసగా మూడు రియల్ ఎస్టేట్ కార్యాలయాల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు. కార్యాలయాల్లో ఉన్న కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసి, వస్తువులను చిందరవందరగా ఫెణిగించారు. అలాగే, ఆఫీసు ఆవరణంలో పార్క్ చేసి ఉన్న ఇన్నోవా కారును కూడా దెబ్బతీశారు.

దొంగలు అక్కడే ఉన్న మరో ఇంట్లోకి చొరబడి దాని వద్ద ఉన్న కారుని తీసుకొని కాలనీలో తిరిగారు. మొత్తం ఘటనతో కాలనీలో తీవ్ర కలకలం రేగింది. దొంగలు సుమారుగా రూ. 30 వేల నగదును అపహరించినట్లు సమాచారం. ఈ చోరీలతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

బాధితులు వెంటనే అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. అక్కడి సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించి, దోషుల గుర్తింపు కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. భద్రత చర్యల్లో భాగంగా కాలనీలో నిఘాను బలోపేతం చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనల నేపథ్యంలో స్థానికులు గస్తీ పెంచాలని, అప్రమత్తంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

Blogger ఆధారితం.