-->

కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి యువతిపై లైంగికదాడి – వీడియో

కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి యువతిపై లైంగికదాడి – వీడియో


జగిత్యాల జిల్లా ధర్మపురిలో దారుణ ఘటన వెలుగుచూసింది. కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి 19 ఏళ్ల యువతిపై లైంగికదాడికి పాల్పడిన సంఘటన కలకలం రేపుతోంది. బాధితురాలి మీద దాడి చేసిన నిందితుడు గంగాధర్, ఓ ఆన్‌లైన్‌ పత్రికకు విలేకరిగా పని చేస్తున్నాడు.


పోలీసుల సమాచారం మేరకు, నిందితుడు బాధిత యువతిని మోసం చేసి కూల్‌డ్రింక్‌ తాగించాడని, అనంతరం ఆమె అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో లైంగికదాడికి పాల్పడినట్లు వెల్లడించారు. దాడిని సెల్‌ఫోన్‌లో వీడియో తీసి తన స్నేహితుడికి షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై బాధిత యువతిని వైద్య పరీక్షలకు పంపించారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడికి కఠిన శిక్ష పడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


Blogger ఆధారితం.