మెగా ఆధార్ క్యాంపు మండలాలకూ విస్తరించాలి – మైనారిటీ ప్రెసిడెంట్ గౌస్ వినతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న మెగా ఆధార్ క్యాంపుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అయితే, అధిక సంఖ్యలో ప్రజలు క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడుతుండడంతో వృద్ధులు, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మైనారిటీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు మొహ్మద్ గౌస్ జిల్లా కలెక్టర్, మెగా ఆధార్ క్యాంపును కలెక్టరేట్‌తో పాటు ప్రతి మండలంలోనూ రెండురోజుల పాటు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి మండలంలో ఆధార్ క్యాంపులు నిర్వహిస్తే, అవి మరింత ప్రభావవంతంగా సాగుతాయని, ఎక్కువ మందికి సేవలు అందుతాయని ఆయన సూచించారు. ప్రజలందరికీ సమానంగా సేవలు అందించాలన్నదే తమ అభిప్రాయమని గౌస్ తెలిపారు.
Post a Comment