-->

గుజరాత్‌లో ఘోర ప్రమాదం – కుప్పకూలిన వంతెన, నదిలో వాహనాలు (వీడియో)

గుజరాత్‌లో ఘోర ప్రమాదం – కుప్పకూలిన వంతెన, నదిలో వాహనాలు (వీడియో)


గుజరాత్ రాష్ట్రంలోని మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జీ మంగళవారం అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలింది. వడోదర మరియు ఆనంద్ జిల్లాలను కలుపుతూ ముఖ్య రహదారిగా ఉపయోగపడుతున్న ఈ వంతెన కూలడంతో పలువురు ప్రయాణికులు గలిగిన వాహనాలు నదిలో పడిపోయాయి.



ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉన్నా, వంతెన యొక్క నిర్మాణ లోపమే దీనికి కారణమై ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనాస్థలానికి వెంటనే సహాయక బృందాలు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి.

ప్రస్తుతం 6 వాహనాలు నదిలో పడిపోయినట్టు ప్రాథమికంగా గుర్తించామని, క్షతగాత్రుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

ప్రమాదంపై సీఎం భూపేంద్ర పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, సంఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. బాధితులకు తగిన పరిహారం అందజేస్తామని ప్రకటించారు.

Blogger ఆధారితం.