💥మామతో యవ్వారం… కూతురిని హత్య చేసిన తల్లి
నిజాన్ని బహిర్గతం చేసిన పోలీసుల దర్యాప్తు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఘటన ఖమ్మం జిల్లాలో మానవత్వాన్ని మరిచిపోయే రీతిలో జరిగిన హత్య కేసులో కోర్టు కీలక తీర్పు చెప్పింది. సభ్యసమాజం తలదించుకునేలా ఉన్న ఈ సంఘటనలో, సత్తుపల్లి కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించింది. వివాహేతర సంబంధం కాపాడుకోవాలనే మానసికతతో ఒక తల్లి తన కన్నకూతురిని హత్య చేయడమే కాక, మూడో వ్యక్తిపై నింద మోపే ప్రయత్నం చేసిన ఘటన ఇది.
వివరాల్లోకి వెళితే…
బోనకల్లు మండలానికి చెందిన పాలెపు నరసింహారావు తన కుమారుడు హరికృష్ణకు సునీత అనే మహిళను వివాహం చేశాడు. ఈ దంపతులకు ఓ కుమార్తె జన్మించింది. బాలిక 12 ఏళ్ల వయస్సులోకి వచ్చే వరకు సాధారణంగా సాగిన కుటుంబ జీవితం, ఓ దారుణ మలుపు తీసుకుంది.
కొన్ని కాలంగా సునీత, తన మామ నరసింహారావుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది. భర్త హరికృష్ణ ఇంట్లో లేని సమయంలో వీరిద్దరూ గడిపే సమయాన్ని బాలిక చూసింది. ఈ విషయం బయటకు వెళ్లే ప్రమాదం ఉందని గ్రహించిన తల్లి సునీత, తన మామతో కలిసి కిరాతక పథకం సిద్ధం చేసింది.
కిరాతక చర్య: ప్లాన్ ప్రకారమే హత్య
ఒక రాత్రి బాలిక నిద్రలో ఉన్న సమయంలో సునీత, నరసింహారావుతో కలిసి ఆమెపై దాడికి దిగారు. బాలిక చేతులు, కాళ్లు కట్టేసి, వైరుతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం ఈ హత్యను ఫిట్స్‌తో పడి మరణించినట్టు నాటకం ఆడారు. బాలికను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
ఖమ్మం ఆసుపత్రిలో వైద్యులు బాలిక మరణించిందని ధృవీకరించగా, ఆమె మెడపై వైరుతో బిగించిన గాయాలు గుర్తించి అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం చేయొద్దని సునీత, నరసింహారావు విజ్ఞప్తి చేయడం కూడా వైద్యులను అప్రమత్తం చేసింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసుల దర్యాప్తు… నాటకానికి తెరలేపింది
తాత్కాలికంగా బాధితురాలి మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన నాటి ఎస్‌ఐ కవిత, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. విచారణలో దాచిపెట్టిన వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటపడటంతో అసలు హత్యచర్య బట్టబయలైంది. అన్ని ఆధారాలను పరిశీలించిన కోర్టు, మామ నరసింహారావు, కోడలు సునీతకు జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది.
తీరని తల్లిదనానికీ, మానవ సంబంధాలకీ మచ్చ
ఈ సంఘటన నైతిక విలువలు క్షీణిస్తున్న దుస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. తల్లి తన కన్న బిడ్డను ప్రేమించాల్సిన చోట, సిగ్గు మరిచి హత్య చేయడం… మానవ సంబంధాలపై పెద్ద ప్రశ్నార్థకం వేసింది.
Post a Comment