మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీకి ఘన సత్కారం
మెదక్, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం (UNHRC) ఆధ్వర్యంలో ఈరోజు మెదక్ జిల్లాలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ D.V. శ్రీనివాసరావు, IPS మరియు అడిషనల్ ఎస్పీ S. మహేందర్ ని మర్యాదపూర్వకంగా కలసి శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ జహీర్ ఇక్బాల్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ కుద్రత్ అలీ, రాష్ట్ర సెక్రటరీ పరమేష్ గౌడ్, రాష్ట్ర యువత అధ్యక్షుడు మొహమ్మద్ మోసిన్, మెదక్ జిల్లా యువత అధ్యక్షుడు Ahtesham, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇక్బాల్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ అన్వర్ పాషా, మహిళా జిల్లా అధ్యక్షురాలు అభర్ణ, మహిళా జనరల్ సెక్రటరీ మంగా, సభ్యులు లక్ష్మీ, లలిత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ మానవ హక్కుల కార్యకర్తలతో చర్చిస్తూ, సమాజంలో మానవ హక్కుల పరిరక్షణలో వారి పాత్రపై పలు విలువైన సూచనలు, సలహాలు అందించారు.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు పాల్గొన్న అందరికీ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
Post a Comment