💥 దేశవ్యాప్తంగా భారత్ బంద్ చేపట్టిన కార్మిక సంఘాలు 💥
8 గంటల పని విధానాన్ని తప్పుపడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్‌లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు మంగళవారం దేశవ్యాప్తంగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. కార్మికుల హక్కులను హరించే ఈ కొత్త చట్టాలను వెంటనే రద్దు చేయాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ భారత్ బంద్‌కు అనేక రాజకీయ, సామాజిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (మునుపటి ట్విట్టర్) లో పోస్ట్ చేస్తూ కార్మిక సంఘాల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కార్మిక సంఘాలు ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌పోర్ట్, కర్మాగారాలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల్లో బంద్ ప్రభావం కొంతమేర కనిపిస్తోంది.
Post a Comment