-->

ఘనంగా మైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా మైపాల్ రెడ్డి జన్మదిన ఘనంగా వేడుకలు


మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మనోహరాబాద్ మండలంకు చెందిన ప్రజాప్రియ నాయకుడు చిట్కుల్ మైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామస్థులు, అభిమానం కలిగిన ప్రజలు, అనేక గ్రామాల నుండి వచ్చిన అభిమానులతో ఈ వేడుకలు మహోత్సవ వాతావరణాన్ని తలపించాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరై మైపాల్ రెడ్డిని ఆశీర్వదించారు. అలాగే మెదక్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజనేయులు గౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యుడు జావేద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

పలు గ్రామాల నుండి అభిమానులు బృందాలుగా డప్పు చప్పట్లతో ఊరేగింపుగా వచ్చి ఘనంగా స్వాగతం పలికారు. మనోహరాబాద్‌లోని శుభం ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన వేడుకలకు వందల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అభిమానులు మైపాల్ రెడ్డిని గజమాలు, శాలువాలు, పూలబుకేలుతో సత్కరించారు.

ఈ సందర్భంగా మైపాల్ రెడ్డి గారు మనోహరాబాద్ పంచాయతీ కార్మికులకు బియ్యం మరియు నిత్యావసర సరుకులను స్వయంగా అందజేశారు. ప్రజల ప్రేమతో రాజకీయ జీవితంలో ముందుకు సాగుతూ, సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతానని మైపాల్ రెడ్డి తెలియజేశారు.

Blogger ఆధారితం.