-->

బోల్తాపడిన డీసీఎం వ్యాన్ – తృటిలో తప్పిన ప్రమాదం

 

బోల్తాపడిన డీసీఎం వ్యాన్ – తృటిలో తప్పిన ప్రమాదం

బెజ్జంకి: కరీంనగర్ నుండి హైదరాబాద్‌కు కుటుంబంతో పాటు గృహోపకరణాలు తరలిస్తున్న డీసీఎం వ్యాన్ మండలంలోని గాగిల్లాపూర్ గ్రామం వద్ద ప్రమాదానికి గురైంది. రాజీవ్ రహదారి పై హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ఘటన ఈరోజు ఉదయం చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం, వేగంగా వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కకు జారిపడి బోల్తా పడింది. ఈ ప్రమాదంతో వాహనంలో ఉన్న గృహోపకరణాలు, ఫర్నిచర్ సామగ్రి రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.

అయితే, ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే విషయం. వాహనంలో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారికి సహాయం చేశారు.

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793