-->

చేతులు కట్టేసి న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్.. యువతి నుంచి 1.10 లక్షల దోపిడీ

చేతులు కట్టేసి న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్.. యువతి నుంచి రూ.1.10 లక్షల దోపిడీ

చేతులు కట్టేసి న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్.. యువతి నుంచి 1.10 లక్షల దోపిడీ

హైదరాబాద్, జూన్ 28: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్నాప్‌చాట్‌లో పరిచయమైన యువతిని నమ్మించి హోటల్‌కు రప్పించిన ఓ యువకుడు కత్తితో బెదిరించి, ఆమె చేతులు కట్టేసి న్యూడ్ వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసి రూ.1.10 లక్షలు దోచుకున్నాడు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా సూదివారిపాలెంకు చెందిన కిలారి నాగతేజ అలియాస్ నాని (24) గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం మాదాపూర్‌లోని ఓ పీజీ హాస్టల్‌లో ఉంటున్నాడు. స్నాప్‌చాట్ ద్వారా ఓ ఐటీ ఉద్యోగినితో పరిచయం పెంచుకున్న నాగతేజ, ఐదు రోజుల క్రితం గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్ సమీపంలోని ఎల్లో స్టోన్ హోటల్‌లో నకిలీ పత్రాలతో గది అద్దెకు తీసుకున్నాడు.

మాయమాటలు చెప్పి యువతిని హోటల్‌కు రప్పించిన అనంతరం, ఆమె చేతులు కట్టేసి కత్తితో బెదిరించి న్యూడ్ వీడియోలు, ఫొటోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో, కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరిస్తూ రూ.1.10 లక్షలు తన ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. అనంతరం బాధితురాలి ఫోన్ నంబర్‌తో క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ ఘటనపై బాధితురాలు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నాగతేజను అరెస్ట్ చేశారు. అతని మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా మరో ఇద్దరు, ముగ్గురు యువతుల న్యూడ్ వీడియోలు కూడా ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఇతర బాధితులు కూడా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

దర్యాప్తులో మరో సంచలన విషయం బయటపడింది. నిందితుడి తల్లిదండ్రులు చిన్న కుమారుడి చదువు కోసం తమ ఒక్క ఎకరం పొలాన్ని విక్రయించి బ్యాంకు ఖాతాల్లో ఉంచుకున్న రూ.10 లక్షలను కూడా వారికి తెలియకుండా నాగతేజ కాజేశాడని పోలీసులు తెలిపారు. ఆ డబ్బంతా క్రికెట్ బెట్టింగ్‌లలో పోగొట్టినట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793