-->

ఎయిర్‌పోర్టులో నకిలీ పూజారి అరెస్ట్‌.. అమెరికా నుంచి రాగానే అదుపులోకి

ఎయిర్‌పోర్టులో నకిలీ పూజారి అరెస్ట్‌.. అమెరికా నుంచి రాగానే అదుపులోకి

ఎయిర్‌పోర్టులో నకిలీ పూజారి అరెస్ట్‌.. అమెరికా నుంచి రాగానే అదుపులోకి

శంషాబాద్‌, జూన్ 28: పూజల పేరుతో ప్రజలను మోసం చేసి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన నకిలీ పూజారి చామర్తి రామలచ్చారావును శనివారం శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకుని బాచుపల్లి పోలీసులకు అప్పగించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివసించే పలువురు వ్యక్తుల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తానంటూ రామలచ్చారావు భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. అయితే డబ్బులు తీసుకున్న తర్వాత పూజలు నిర్వహించకుండా వారిని మోసం చేసి అమెరికాకు వెళ్లిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అమెరికాలో కూడా ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు సమాచారం. అక్కడ ఒక దేవాలయ యజమాని ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తనను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని భావించిన రామలచ్చారావు భారత్‌కు తిరిగి వచ్చాడు.

అతడు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే అప్రమత్తమైన ఇమిగ్రేషన్‌ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని బాచుపల్లి పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.

రామలచ్చారావు మోసాలకు సంబంధించి మరికొందరు బాధితులు ఉన్నారా? ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793