-->

నల్లగొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసు ఛేదించిన పోలీసులు

 

నల్లగొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసు ఛేదించిన పోలీసులు

నల్లగొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసు ఛేదించిన పోలీసులు

నల్లగొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఇటీవల సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి వివాదాలే ఈ దారుణ హత్యలకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

మృతులు మహమ్మద్ సుల్తాన్ (45), ఆయన భార్య హసీన (40), కుమారుడు ముజమిల్ (20), కుమార్తె అక్సర (11)గా గుర్తించారు. ఈ కేసులో హసీన మొదటి భర్త కుమార్తె, ఆమె భర్త కలిసి సుపారీ గ్యాంగ్‌తో ఈ హత్యలు చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు.

పోలీసుల వివరాల ప్రకారం, హసీనకు గతంలో రెండు వివాహాలు జరగగా, అనంతరం నల్లగొండకు చెందిన మహమ్మద్ సుల్తాన్‌ను మూడో వివాహం చేసుకుంది. హసీన పేరుపై కోటి రూపాయలకు పైగా విలువైన స్థలాలు, ఇళ్ల ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులను తన మూడో భర్త సుల్తాన్ పిల్లలైన ముజమిల్, అక్సర పేర్లపై వీలునామా రాయాలని హసీన నిర్ణయించడంతో, ఆమె మొదటి భర్త కుమార్తెకు ఆగ్రహం కలిగినట్లు విచారణలో వెల్లడైంది.

ఈ నేపథ్యంలో హసీన మొదటి భర్త కుమార్తె, ఆమె భర్త హైదరాబాద్ పాతబస్తీకి చెందిన నలుగురు రౌడీ షీటర్లను సుపారీపై నియమించి హత్యలు చేయించినట్లు పోలీసులు గుర్తించారు.

పోస్టుమార్టం నివేదికలోనూ హత్యల క్రూరత్వం బయటపడింది. సుల్తాన్ శరీరంపై 6 కత్తి గాయాలు, హసీనపై 7 కత్తిపోట్లు, 11 ఏళ్ల అక్సరపై 9 కత్తి గాయాలు, ముజమిల్‌పై ఏకంగా 16 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.

ప్రత్యేకంగా చిన్నారి అక్సర హత్య విషాదకరంగా మారింది. హంతకులను చూసి భయపడిన ఆమె మంచం కింద దాక్కునే ప్రయత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె మృతదేహం సగం భాగం మంచం కింద ఉండటంతో, హంతకులు బయటకు లాగి దారుణంగా హత్య చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులే పథకం రచించి నలుగురి ప్రాణాలు బలిగొన్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. కేసులో ప్రధాన నిందితులు, సుపారీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793