ప్రొఫెసర్ జయశంకర్ 15వ వర్ధంతి వేడుకలకు తెలంగాణ జేఏసీ పిలుపు
ప్రొఫెసర్ జయశంకర్ 15వ వర్ధంతి వేడుకలకు తెలంగాణ జేఏసీ పిలుపు
షాద్‌నగర్: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకుడైన ప్రొఫెసర్ కె. జయశంకర్ 15వ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఫరూక్‌నగర్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించనున్నట్లు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) షాద్‌నగర్ తాలూకా నాయకులు తెలిపారు.
తెలంగాణ జేఏసీ షాద్‌నగర్ తాలూకా ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో తొలి దశ, మలిదశ తెలంగాణ ఉద్యమకారులు, అమరుల కుటుంబ సభ్యులు, విద్యార్థి, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్స్, కుల మరియు ప్రజా సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
ఈ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీర్లపల్లి శంకర్, ప్రభుత్వ రంగ సంస్థల రాష్ట్ర చైర్మన్, ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు హాజరవుతారని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ జేఏసీ షాద్‌నగర్ తాలూకా నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు.

Post a Comment