బైక్ ప్రమాదం.. పుట్టినరోజునాడే యువకుడి మృతి
బైక్ ప్రమాదం.. పుట్టినరోజునాడే యువకుడి మృతి
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన రాకేశ్ (22) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. హైదరాబాద్‌లో బైక్‌పై వెళ్తున్న సమయంలో అతను రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
చింతగూడ గ్రామానికి చెందిన మల్లేశ్–సుజాత దంపతుల పెద్ద కుమారుడైన రాకేశ్ హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తున్నాడు. మంగళవారం అతని పుట్టినరోజు కావడంతో సోమవారం అర్ధరాత్రి స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసేందుకు బయలుదేరాడు.
ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైన రాకేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిన రోజే యువకుడు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Post a Comment