రోడ్డు ప్రమాదంలో గాయపడిన హెచ్‌ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్
రోడ్డు ప్రమాదంలో గాయపడిన హెచ్‌ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్
గోదావరిఖని, జూన్ 20: మంథని మండలం దుబ్బపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హెచ్‌ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రియాజ్ అహ్మద్‌కు స్వల్ప గాయాలు కాగా, కారులో ఉన్న హెచ్‌ఎంఎస్ నాయకులు ఆరెళ్లి పోషం, నాగేందర్, సతీష్‌లు సురక్షితంగా బయటపడ్డారు.
ప్రమాదంలో గాయపడిన రియాజ్ అహ్మద్ ప్రస్తుతం సింగరేణి గోదావరిఖని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
విషయం తెలుసుకున్న హెచ్‌ఎంఎస్ జాతీయ కార్యదర్శి, టెమ్రీస్ కౌన్సిలర్ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ కుటుంబ సభ్యులతో కలిసి రియాజ్ అహ్మద్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. అలాగే హెచ్‌ఎంఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కూడా ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు రియాజ్ అహ్మద్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో ప్రాణాపాయం తప్పినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, ఆయన త్వరగా సాధారణ జీవితంలోకి తిరిగి రావాలని కోరుకున్నారు.

Post a Comment