-->

వాహన తనిఖీల్లో విషాదం.. టిప్పర్ ఢీకొని డీటీవో అధికారి మృతి

వాహన తనిఖీల్లో విషాదం.. టిప్పర్ ఢీకొని ఆర్టీవో అధికారి మృతి

వాహన తనిఖీల్లో విషాదం.. టిప్పర్ ఢీకొని డీటీవో అధికారి మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న డీటీవో అధికారిని బొగ్గు టిప్పర్ ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.


"ఈ వార్తను వాయిస్ లో వినవచ్చును"

వివరాల ప్రకారం, జిల్లాలోని గణపురం మండలం చెల్పూరు శివారులో ఉన్న ఆర్టీవో కార్యాలయం ఎదుట అధికారులు స్కూల్ బస్సులు, ఇతర వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వేగంగా వస్తున్న బొగ్గు టిప్పర్‌ను ఆపేందుకు డీటీవో అధికారి వెంకన్న ప్రయత్నించారు. అయితే టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోవడంతో అది నేరుగా వెంకన్నను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో వెంకన్న తీవ్ర గాయాలకు గురై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో ఆర్టీవో శాఖ అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విధి నిర్వహణలో ఉన్న అధికారి ప్రాణాలు కోల్పోవడం పట్ల స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, వెంకన్న ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా గణపురం ప్రాంతానికి వచ్చినట్లు సమాచారం. ఆయన మరణవార్త తెలిసిన కుటుంబ సభ్యులు, సహచర ఉద్యోగులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793