కల్లూరులో డీసీసీబీ కొత్త బ్రాంచ్ ప్రారంభం.. ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కల్లూరులో డీసీసీబీ కొత్త బ్రాంచ్ ప్రారంభం.. ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కల్లూరు: సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని కల్లూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) శాఖను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకు ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శాఖను ప్రజలకు అంకితం చేశారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, జిల్లా సహకార శాఖ అధికారులు, బ్యాంకు ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలు, రైతులకు మరింత మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో డీసీసీబీ శాఖలను విస్తరిస్తున్నామని తెలిపారు. కొత్త బ్రాంచ్ ద్వారా కల్లూరు పరిసర ప్రాంతాల ప్రజలకు రుణాలు, పొదుపు, ఇతర బ్యాంకింగ్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందించాలని బ్యాంకు అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సహకార సంఘాల ప్రతినిధులు, తుమ్మల అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన శాఖ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు.

Post a Comment