గోదావరిఖనిలో "యాదే హుస్సైన్" అంశంపై ప్రత్యేక సమావేశం
గోదావరిఖనిలో "యాదే హుస్సైన్" అంశంపై ప్రత్యేక సమావేశం
గోదావరిఖని: గోదావరిఖనిలోని జామే మసీదులో ఆదివారం (28-06-2026) మఘ్రిబ్ నమాజ్ అనంతరం "యాదే హుస్సైన్" అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జమాత్-ఎ-ఇస్లామీ హింద్ (JIH) గోదావరిఖని యూనిట్ మావీన్ అమీర్ ముకామీ ఖాజీ మహ్మద్ ఇస్మాయిల్ నిజామీ ముఖ్య వక్తగా పాల్గొని హుస్సైన్ (ర.అ.) జీవిత విశేషాలు, త్యాగాలు, వాటి ప్రాముఖ్యతపై ప్రసంగించారు.
ఈ సమావేశానికి జావీద్ హుస్సైనీ (అమీర్ ముకామీ), ఫసియుద్దీన్, ముస్తఫా, సర్వర్ భాయ్, మసీదు సదర్, అఫ్సర్ పాషా (ఏరియా సర్వే ఆఫీసర్, ఆర్‌జీ-3) తదితరులు హాజరయ్యారు.
మొత్తం 25 మంది రుక్న్‌లు, కర్కున్‌లు, ముతఫ్ఫికీన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మహ్మద్ ఫయాజొద్దీన్, మావీన్ అమీర్ ముకామీ, జమాత్-ఎ-ఇస్లామీ హింద్ గోదావరిఖని యూనిట్, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

Post a Comment