కొత్తపేటలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్
కొత్తపేటలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్
రూ.22,930 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం
మెదక్/శివ్వంపేట, జూన్ 28: శివ్వంపేట మండలంలోని కొత్తపేట గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై శివ్వంపేట పోలీసులు ఆదివారం ఆకస్మిక దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
దాడి సందర్భంగా నిందితుల వద్ద నుంచి రూ.22,930 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, పేక ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
అరెస్టైన వారిలో శివ్వంపేటకు చెందిన లష్కరి స్వామి (41), వడ్డే ప్రభాకర్ (31), గోమారం గ్రామానికి చెందిన గడ్డం శ్రీకాంత్ రెడ్డి (38), వడ్ల హరి (26), రుస్తుంపేట సాయి (28) ఉన్నారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ మండల పరిధిలో జూదం, పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

Post a Comment