-->

అవినీతి ఆరోపణలపై సీఐ, ఎస్ఐ పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు

అవినీతి ఆరోపణలపై సీఐ, ఎస్ఐ పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు
 అవినీతి ఆరోపణలపై సీఐ, ఎస్ఐ పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు

వరంగల్ కమిషనరేట్ పరిధిలో అవినీతి ఆరోపణలపై ఇద్దరు పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. వెస్ట్ జోన్ పరిధిలోని నర్మెట్ట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. అబ్బయ్య, గతంలో బచ్చన్నపేట ఎస్ఐగా పనిచేసి ప్రస్తుతం ఏఆర్‌కు అటాచ్ అయిన ఎస్ఐ షేక్ హమీద్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

అవినీతి ఆరోపణలపై నిర్వహించిన విచారణలో ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఇద్దరినీ సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఒకే కేసులో సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులపై ఒకేసారి సస్పెన్షన్ చర్యలు తీసుకోవడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కాగా, సీఐ అబ్బయ్యపై గతంలో కూడా అవినీతి ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. ఆయన కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన సమయంలోనూ పలు ఫిర్యాదులు నమోదైనట్లు తెలుస్తోంది. అనంతరం పరకాల సీఐగా పోస్టింగ్ ఇచ్చినప్పటికీ, స్థానికంగా వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఆ పోస్టింగ్‌ను రద్దు చేసినట్లు సమాచారం.

అయితే, ప్రస్తుత సస్పెన్షన్‌కు సంబంధించి పోలీసులు అధికారికంగా విడుదల చేసిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793