ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు, ఒకరు మృతి
ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు, ఒకరు మృతి
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు డివైడర్‌ను బలంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం (గాంధీ) ఆస్పత్రికి తరలించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, బాధితులు అస్సాం నుంచి తమ స్వగ్రామమైన కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్‌కు వస్తుండగా ఉప్పల్ గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు, గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment