బతుకమ్మ పండుగ కానుక.. మహిళలకు ‘ఇందిరా మహిళా శక్తి’ చీరలు
తెలంగాణలో బతుకమ్మ పండుగ కానుక.. మహిళలకు ‘ఇందిరా మహిళా శక్తి’ చీరలు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేక కానుక అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.05 కోట్ల మంది మహిళలకు ‘ఇందిరా మహిళా శక్తి’ చీరలను పంపిణీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
చీరల తయారీ ప్రక్రియను ఇప్పటికే వేగవంతం చేశారు. ముఖ్యంగా సిరిసిల్లతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేతన్నలు చీరల తయారీలో నిమగ్నమయ్యారు. బతుకమ్మ పండుగ నాటికి అవసరమైన సంఖ్యలో చీరలను సిద్ధం చేసి పంపిణీ చేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈసారి మహిళలకు పంపిణీ చేయనున్న చీరలు ఆకర్షణీయమైన చిలుక పచ్చ రంగులో ఉండనున్నాయి. పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఈ చీరలను అందజేయనున్నారు. దీంతో నేత పరిశ్రమకు కూడా ప్రోత్సాహం లభించడంతో పాటు, బతుకమ్మ పండుగ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ఈ చీరలను ధరించే అవకాశం ఉంది.

Post a Comment