డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 13 మందికి కోర్టు షాక్.. భారీగా జరిమానాలు!

 

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 13 మందికి కోర్టు షాక్.. భారీగా జరిమానాలు!

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 13 మందికి కోర్టు షాక్.. భారీగా జరిమానాలు!

యాచారం: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన 13 మందికి ఇబ్రహీంపట్నం కోర్టు జరిమానాలు విధించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను శనివారం విచారించిన న్యాయస్థానం నిందితులకు భారీగా జరిమానాలు విధించడంతో పాటు ఇద్దరికి రెండు రోజుల పాటు రోడ్డు ట్రాఫిక్ డ్యూటీ చేయాలని ఆదేశించింది.

సీఐ నందీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాచారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 13 మంది పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరుపరిచారు.

కేసులను విచారించిన న్యాయస్థానం ఆరుగురికి ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున, ఇద్దరికి రూ.6 వేల చొప్పున, ఒకరికి రూ.7 వేలు, మరో ఇద్దరికి రూ.8 వేల చొప్పున, ఇంకో ఇద్దరికి రూ.10 వేల చొప్పున జరిమానాలు విధించింది. అదేవిధంగా మరో ఇద్దరికి రెండు రోజుల పాటు రోడ్డు ట్రాఫిక్ డ్యూటీ విధించింది.

కోర్టు విచారణ అనంతరం 13 మందికి యాచారం పోలీస్ స్టేషన్‌లో రహదారి భద్రతపై ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాహనదారులతో పాటు రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా తీవ్ర ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ మద్యం సేవించినప్పుడు వాహనాలు నడపకుండా ఉండాలని, రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులు సూచించారు.

Blogger ఆధారితం.