అమ్మ అంత్యక్రియలకు రాని కొడుకు.. ఊరికి రాగానే అడ్డుకున్న గ్రామస్తులు!
అమ్మ అంత్యక్రియలకు రాని కొడుకు.. ఊరికి రాగానే అడ్డుకున్న గ్రామస్తులు!
జనగామ జిల్లా తరిగొప్పుల గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన తరిగొప్పులలో ఉద్రిక్తత.. కొడుకుపై గ్రామస్తుల ఆగ్రహం
జనగామ జిల్లా తరిగొప్పుల గ్రామంలో ఓ కుటుంబ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన పుష్పనీల మృతి చెందిన సమయంలో అంత్యక్రియలకు హాజరుకాని ఆమె కుమారుడు ఉప్పలయ్య శనివారం కుటుంబ సభ్యులతో కలిసి గ్రామానికి రావడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
పుష్పనీల గ్రామంలో అందరికీ ఆప్యాయంగా ఉండేవారని, పలువురికి సహాయం చేస్తూ తల్లిలా ఆదరించేవారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఆమె మరణించిన సమయంలో కుమారుడు అంత్యక్రియలకు రాకపోవడంతో గ్రామస్తులే ముందుకు వచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లు తెలిపారు.
అయితే, కొన్ని రోజుల తర్వాత కుమారుడు గ్రామానికి రావడంతో మహిళలు, యువకులు అతడిని నిలదీశారు. తల్లి బతికున్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదని, మరణించినప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది.
గ్రామస్తులు అతడు ప్రయాణిస్తున్న కారును ఊరి బయట అడ్డుకుని, కారులో ఉన్న కుటుంబ సభ్యులను బయటకు లాగి దాడి చేసినట్లు సమాచారం. అనంతరం వారిని గ్రామం నుంచి వెళ్లగొట్టినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనలో ఉప్పలయ్య ఎలాంటి స్పందన ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.
గ్రామస్తుల ఆవేదన ఇదే..
పుష్పనీల తమకు తల్లిలాంటి వారని, ఆమె అంత్యక్రియలను తామే నిర్వహించామని గ్రామస్తులు చెబుతున్నారు. తల్లి మరణించిన సమయంలో అండగా నిలవని కుమారుడి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment