గోదావరిఖనిలో ఘనంగా CIO సైన్స్ అండ్ మోరల్ వాల్యూస్ ఒలింపియాడ్ – 2026
గోదావరిఖనిలో ఘనంగా CIO సైన్స్ అండ్ మోరల్ వాల్యూస్ ఒలింపియాడ్ – 2026
స్పందన, శాంతినికేతన్ పాఠశాలల్లో పరీక్షలు.. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
గోదావరిఖని, నవంబర్ 29: చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (CIO) గోదావరిఖని యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ అండ్ మోరల్ వాల్యూస్ ఒలింపియాడ్ – 2026 పరీక్షలు ఆదివారం విజయవంతంగా జరిగాయి. గోదావరిఖనిలోని 8 ఇంక్లైన్ కాలనీలో ఉన్న స్పందన స్కూల్, శాంతినికేతన్ స్కూల్లలో ఈ పరీక్షలను నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పరీక్షల్లో పాల్గొన్నారు.
6, 7, 8వ తరగతుల విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, పరిశీలనా నైపుణ్యం, సృజనాత్మకత, తార్కిక ఆలోచనలతో పాటు నైతిక విలువలను పెంపొందించడమే ఈ ఒలింపియాడ్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
NCERT 6, 7, 8వ తరగతుల సైన్స్ పాఠ్యపుస్తకాల ఆధారంగా పరీక్ష నిర్వహించారు. ప్రతి తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేయనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో CIO గోదావరిఖని యూనిట్ అధ్యక్షుడు సయ్యద్ జావేద్ అక్మల్ హుస్సేని, ఉపాధ్యక్షుడు ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ, మెంటర్ హుస్నా, యాసర్ అరాఫత్, ఆయేషా సిద్ధిఖా, గౌహర్ అంజుమ్ తదితరులు పాల్గొని పరీక్షల నిర్వహణలో సహకరించారు.
విద్యార్థుల్లో కేవలం విద్యా ప్రతిభనే కాకుండా మంచి వ్యక్తిత్వం, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించే దిశగా CIO చేపడుతున్న ఈ కార్యక్రమం అభినందనీయమని పలువురు ప్రశంసించారు.

Post a Comment