-->

అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా దిష్టిబొమ్మ దహనం


తూప్రాన్, మెదక్ జిల్లా: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా తక్షణమే మంత్రి పదవి నుండి తొలగించాలనే డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంలో తూప్రాన్ అంబేద్కర్ సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ కార్యక్రమానికి అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పసుల నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి గజ్జెల కృష్ణతో పాటు సంఘ సభ్యులు మామిడి వెంకటేష్, సామల అశోక్ కుమార్, ఎర్పుల లక్ష్మణ్, సర్గల రాములు తదితరులు హాజరయ్యారు.

ఆందోళనకారులు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తిరస్కరిస్తూ ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని, రాజ్యాంగ నిర్మాత పట్ల మర్యాద చూపాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమం ద్వారా అంబేద్కర్ ఘనతను మరింత గుర్తుచేస్తూ, అంబేద్కర్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం శాంతియుతంగా కొనసాగింది.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793