ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
హాసన్పర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హాసన్పర్తి పెద్ద చెరువు సమీపంలో కాలేజ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులను సుప్రతిక్, అక్రమ్‌గా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
👉 రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది? టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Post a Comment