భద్రాద్రి జిల్లాకు వనమా రాఘవను అధ్యక్షుడిగా నియమిస్తే బీఆర్‌ఎస్‌కు పూర్వ వైభవం
వనమా రాఘవ గతంలో పార్టీ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించి, భారీ సభలను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. అభివృద్ధి కార్యక్రమాలను ముందుండి నడిపిస్తూ, ఒంటి చేత్తో పార్టీ కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించి అధిష్టానం ప్రశంసలు పొందిన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కమిటీల రద్దుతో కొత్త కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో, భద్రాద్రి జిల్లాకు బలమైన నాయకత్వం అవసరమని స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వనమా రాఘవకు జిల్లా అధ్యక్ష పదవి అప్పగిస్తే పార్టీకి కొత్త ఊపు వస్తుందని వారు విశ్వసిస్తున్నారు.
జిల్లాలో పార్టీ పునర్వ్యవస్థీకరణకు అనుభవజ్ఞుడైన నాయకుడిని ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని, వనమా రాఘవ ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించగలరని కార్యకర్తలు అంటున్నారు. ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే పార్టీ శక్తివంతంగా ముందుకు సాగి పూర్వ వైభవాన్ని తిరిగి సాధిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ డిమాండ్‌పై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Post a Comment