సదాశివపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా, నలుగురికి తీవ్ర గాయాలు
సదాశివపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా, నలుగురికి తీవ్ర గాయాలు
సదాశివపేట: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిజాంపూర్ బైపాస్ వద్ద NH-65 జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ముంబై నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు నిజాంపూర్ బైపాస్ సమీపంలోకి రాగానే అదుపుతప్పింది. దీంతో కారు రహదారి అవతలి వైపునకు దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కారు బోల్తా పడటంతో వారంతా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే 108 అత్యవసర వైద్య సిబ్బంది EMT రమేష్, పైలట్ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, క్షతగాత్రుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై సంబంధిత పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Post a Comment