-->

గుడిలో మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు.. 65 ఏళ్ల వ్యక్తిపై పోక్సో కేసు

గుడిలో మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు.. 65 ఏళ్ల వ్యక్తిపై పోక్సో కేసు

గుడిలో మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు.. 65 ఏళ్ల వ్యక్తిపై పోక్సో కేసు

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 65 ఏళ్ల వ్యక్తిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 13న సాయన్న అనే వ్యక్తి ఆలయానికి తాళం వేసి, మైనర్ బాలికను లోపలికి తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు స్థానికులు గుర్తించారు.

ఈ ఘటనపై 14వ తేదీన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి సాయన్నను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793