లారీ బైక్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో శ్రావణి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి
లారీ బైక్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో శ్రావణి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి
హైదరాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థిని మృతి చెందగా.. ఆమె తల్లిదండ్రులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరుకు చెందిన సురేశ్ (38), ఉమారాణి (33) దంపతులు హైదరాబాద్‌లోని వారాసిగూడలో నివాసం ఉంటున్నారు.
శనివారం బోనాల సందర్భంగా సొంతూరుకు వెళ్లేందుకు కుటుంబం బయలుదేరింది. సాధారణంగా బస్సులో ప్రయాణించే వారు.. ఇటీవల కొత్తగా కొనుగోలు చేసిన బైక్‌పై కుమార్తె శ్రావణి (డిగ్రీ విద్యార్థిని)తో కలిసి స్వగ్రామానికి బయలుదేరారు.
ఈ క్రమంలో ఘట్‌కేసర్‌లోని వందన హోటల్ సమీపానికి చేరుకోగానే వేగంగా వచ్చిన లారీ వారి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి శ్రావణి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిదండ్రులు సురేశ్, ఉమారాణికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబంతో కలిసి సంతోషంగా బోనాలకు స్వగ్రామానికి బయలుదేరిన సమయంలో ప్రమాదం జరగడంతో బంధువులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Post a Comment