-->

కేపీహెచ్‌బీ లేడీస్‌ హాస్టల్‌లో మహిళ ఆత్మహత్య

 

కేపీహెచ్‌బీ లేడీస్‌ హాస్టల్‌లో మహిళ ఆత్మహత్య

కేపీహెచ్‌బీ లేడీస్‌ హాస్టల్‌లో మహిళ ఆత్మహత్య

హైదరాబాద్: కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సర్దార్‌ పటేల్‌ నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ లేడీస్‌ హాస్టల్‌లో హౌస్‌కీపింగ్‌గా పనిచేస్తున్న 51 ఏళ్ల సుధ ఆత్మహత్యకు పాల్పడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతికి చెందిన సుధ కొంతకాలంగా సదరు హాస్టల్‌లో హౌస్‌కీపింగ్‌ సిబ్బందిగా పనిచేస్తూ, అక్కడే నివాసం ఉంటోంది. బుధవారం ఉదయం హాస్టల్‌ సిబ్బంది సంజన గీజర్‌ తాళం కోసం సుధ గది వద్దకు వెళ్లారు. తలుపు మూసి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా సుధ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించింది.

వెంటనే హాస్టల్‌ సిబ్బంది పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు సుధను చూసి తీవ్ర విషాదానికి గురయ్యారు. వైద్య సిబ్బంది పరిశీలించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.

సుధ కొంతకాలంగా కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు ఆమె సోదరి పోలీసులకు తెలిపింది. సుధ మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఈ ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793