-->

తెలంగాణలో 35 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లకు డీఎస్పీగా పదోన్నతులు

 

తెలంగాణలో 35 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లకు డీఎస్పీగా పదోన్నతులు

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న 35 మంది సివిల్ పోలీస్ ఇన్స్పెక్టర్లకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) హోదాకు పదోన్నతులు కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 29-04-2026న జాబితాను విడుదల చేశారు.

పదోన్నతి పొందిన అధికారుల్లో ముఖ్యంగా సీఐడీ, ఇంటెలిజెన్స్, ఏసీబీ, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్, సీసీఎస్, ఎస్‌బీ వంటి విభాగాల్లో సేవలందిస్తున్న అధికారులు ఉన్నారు. వీరిలో పలువురు హైదరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం, జగిత్యాల, సూర్యాపేట, మల్కాజిగిరి, మహబూబాబాద్ వంటి జిల్లాల్లో పనిచేస్తున్నారు.

డీఎస్పీలుగా పదోన్నతి పొందిన అధికారులు:

ఎస్. వెంకటేష్, కె. రవీందర్, సి. విజయరాజు, జి. వెంకటేశ్వర్లు, బి. ప్రవీణ్, బి. శ్రీనివాస్, ఎం. వెంకటనర్సయ్య, జి. మహేందర్ రెడ్డి, జి. సీతారెడ్డి, బి. బాలాజీ, అదపా నర్సింహారావు, ఎం. వెంకట రామయ్య, పి. వెంకటేశ్వర్లు, కె. రామకృష్ణ, కె. భాస్కర్, పి. కరుణాకర్, ఎం. వెంకట్ రెడ్డి, పి. రాజు, ఎన్. వెంకటేశ్వర్లు, జి. గోవర్ధన గిరి, ఎస్. వెంకటేష్ (ట్రాన్స్‌కో), బి. గురునాయుడు, భూపతి గట్టుమల్లు, బి. హరినాథ్ బాబు, చి. రాజిరెడ్డి, ఆర్. నరేందర్, ఎ. రాజయ్య, బి. శ్రీనివాస్ రావు, ఎ. పెద్దన్న కుమార్, టి. స్వామి, టి. ప్రవీణ్ కుమార్, కె. పురుషోత్తం, సర్లా రాజు, గడ్డం సదయ్య (సదన్ కుమార్), ఎం. రాజేష్.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారుల్లో ఉత్సాహం నెలకొంది. పదోన్నతి పొందిన అధికారులు త్వరలోనే కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793