తెలంగాణలో 26 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ.. వరంగల్ సీపీగా శ్వేత
తెలంగాణలో 26 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ.. వరంగల్ సీపీగా శ్వేత
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పోలీసు శాఖలో కీలక పరిపాలనా మార్పులు చేపట్టింది. మొత్తం 26 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో పలువురు అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించగా, కీలక విభాగాల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి.
ప్రధాన నియామకాలు ఇవీ..
- వరంగల్ పోలీస్ కమిషనర్‌గా శ్వేత నియామకం.
- కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్పీగా సింధుశర్మ.
- సీఐడీ ఎస్పీగా చెన్నూరి రూపేష్.
- వికారాబాద్ అడ్మినిస్ట్రేటివ్ ఎస్పీగా రాజేష్ మీరా.
- సైబరాబాద్ జాయింట్ ట్రాఫిక్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్.
- సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా వై. సాయిశేఖర్.
- సీఐడీలో ఎస్పీలుగా చెన్నూరి రూపేష్, ప్రవీణ్ కుమార్.
- గోల్కొండ జోన్ డీసీపీగా రాఘవేందర్ రెడ్డి.
- ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా చంద్రమోహన్.
- ఇంటెలిజెన్స్ ఎస్పీగా రామ్ రెడ్డి.
- హైడ్రా అదనపు కమిషనర్‌గా ఆనంద్ కుమార్.
- ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఇక్బాల్ సిద్దిఖీ.
ఈ బదిలీలతో రాష్ట్ర పోలీసు శాఖలో కీలక పోస్టుల్లో కొత్త అధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఈ మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Post a Comment