నేటి నుంచి ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ప్రారంభం
తెలంగాణలో నేటి నుంచి జూన్ 12 వరకు ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ పేరుతో 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు. అలాగే పది వారాలపాటు ప్రతి వారం ఒక ప్రత్యేక విభాగం లేదా శాఖకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తూ వారోత్సవాలు చేపట్టనున్నారు.
ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించి సుమారు లక్ష మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఈ 99 రోజుల కార్యక్రమంలో సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు వరకు అన్ని స్థాయి ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై సమస్యలను పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమం కీలకంగా ఉండనుంది.

Post a Comment